ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు

, జూలై 11(జనంసాక్షి): మండల కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్రాధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మునగాల మండల కేంద్రంలో ఓబీసీ మండల నాయకులు దాసరి మధు కేక్ కట్ చేసి బండి సంజయ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ నాయకులు రాయల కృష్ణా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ, రాజకీయంగా  ఎదగాలని, బీసీలు ఏ పార్టీలో ఉన్న ఉన్నత పదవులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమానికి సతీష్, వీరబాబు, గోపి, వీరబాబు, అఖిల్ పాల్గొన్నారు.