ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

 రాజ్యంగం దేశ ప్రజలందరికీ పవిత్ర గ్రంథమని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేర్కొన్నారు. ఇరిగేషన్ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ కృషి కారణంగానే భారత్‌ పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందన్నారు. వ్యక్తిగత, ప్రజా జీవితాల్లో రాజ్యాంగ ప్రవచిత అంశాలను విధిగా పాటించాలన్నారు. అనంతరం అధికారులు, సిబ్బందితో భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇక్బాల్ పాష, రాధా, విష్ణువర్ధన్ రెడ్డి, గోపాల్, సంతోష్, సలీం, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.