ఘనంగా మదర్ థెరీసా 112వ జన్మదిన వేడుకలు

 

-డి వై సి ఎం ఓ డాక్టర్ ఉషారాణి

 

మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా హాస్పిటల్ లో డాక్టర్స్ , పారమెడికల్ సిబ్బంది మానవతామూర్తి, సేవకు ప్రతిరూపం అయిన మదర్ తెరిసా 112 వ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరియా హాస్పిటల్ డి.వై .సి .ఎం.ఓ. డాక్టర్ ఉషా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజా రమేష్ బాబు, టి బి జి కే ఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్ మేకల రాజయ్య పాల్గొన్నారు.
ముందుగా నోబెల్ అవార్డు గ్రహీత మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్టాఫ్ సమక్షంలో కేక్ కట్ చేసి మదర్ తెరిసా చేసినటువంటి అనేకమైన సేవల గురించి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగాడాక్టర్ రాజ రమేష్ మాట్లాడుతూమదర్ తెరిసా 1910 ఆగస్టు 26 తారీకు అల్బానియాలో జన్మించారని, తాను వేరే దేశంలో జన్మించి తన జీవితంలో ఎన్నో సేవలు చేస్తున్న సమయంలో కలకత్తాలోని మురికివాడల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి, మనస్సు చలించి, కలకత్తాలో అటు పేద ప్రజలకు, ఇటు విద్యార్థులకు, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ ధైర్యం ఇచ్చి, వారికి ఎనలేని సేవలు చేస్తూ తన జీవితం మొత్తాన్ని సేవకే అంకితం చేసిన గొప్ప మానవతా మూర్తి అని కొనియాడారు. మదర్ తెరిసా అనగానే మన అందరికీ గుర్తొచ్చేది సేవ, దయ, మానవత్వం తను ఎన్నో సందర్భాల్లో ప్రతి ఒక్కరికి సేవ చేసే గుణాన్ని అలవాటు చేసుకోవాలని, ఇతరుల పట్ల మానవత్వంతో ప్రవర్తించాలని, దయా గుణాన్ని అలవర్చుకోవాలని పదే పదే చెబుతూ ఉండేవారనీ పేర్కొన్నారు. అంత గొప్ప మానవతా మూర్తి మన దేశ ప్రజలకు సహాయం చేసినందుకు ప్రతి ఒక్క భారతీయుడు మదర్ తెరిసాకు ఎల్లప్పుడు కృతజ్ఞులై ఉండాలని చెప్పారు. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరము మన చుట్టూ ఉన్న వారిని మనకు తోచినంత సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు
ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రభాకర్, గిరిబాబు, రాజకుమార్, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్, మూర్తి, మెట్రీన్ విజయలక్ష్మి, ఫార్మసిస్ట్ శ్రీనివాస్, పారామెడికల్ సిబ్బంది తిరుపతి, జమదగ్ని, బజ్జన్న, బట్టు, పూర్ణ, ప్రసాద్, బాబురావు, వెంకన్న, అన్సారీ, సంపత్, నాగరాజు, అంబులెన్స్ డ్రైవర్స్ తదితరులు పాలుకొన్నారు.