ఘనంగా మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు కామ్రేడ్ బుగ్గన్న యాదవ్ వర్ధంతి
కుల్కచర్ల, ఆగస్టు 6(జనం సాక్షి):
కుల్కచర్ల మండల పరిధిలోని రాంరెడ్డి పల్లి తన సొంత గ్రామంలో శనివారం మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి కామ్రేడ్ బుగ్గన్న 13వ వర్ధంతిని ఆయన సతీమణి సునంద, కుమారుడు తరుణ్ యాదవ్, తల్లి అనంతమ్మతో కలిసి కాంగ్రెస్ నాయకులు, ఉద్యమకారులు, న్యాయవాదులు బుగ్గన్న యాదవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బొలుసని భీమ్ రెడ్డి,కాంగ్రెస్ మండల అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు మాట్లాడుతూ..
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక పాత్ర వహించిన గొప్పవ్యక్తి అని అన్నారు.
బడుగు బలహీన వర్గాల పోరాట నాయకుడిని కోల్పోయామన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర నాయకులు లాల్ కృష్ణ,పీఆర్ టీయూ రాష్ట్ర నాయకులు టి వెంకటయ్య,బ్లాక్ బి అధ్యక్షులు భరత్ భరత్ కుమార్ బడుగు బలహీన వర్గాల నాయకుడు రామన్న మాదిగ, అడ్వకేట్ బారు అసోసియేషన్ అధ్యక్షులు నర్సింలు యాదవ్, ముజాహిద్పూర్ సర్పంచ్ లక్ష్మి ఆనంద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోయిని కృష్ణయ్య,వెంకటయ్య, రాములు,అనంతయ్య, గ్రామస్తులు,వివిధ గ్రామాల యువకులు తదితరులు పాల్గొన్నారు.