*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి*
మెట్పల్లిటౌన్, ఆగస్టు20
(జనంసాక్షి)
మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు నివాసం లో దివంగత దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మాజీ వైస్ చైర్మన్ ఎర్రోళ్ల హన్మండ్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషాలు మాట్లాడుతూ దేశంలో పేద ప్రజల సంక్షేమానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేశారని గుర్తు చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుండి కృషి చేయాలన్నారు. కాగా దేశ ప్రజలంతా కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో కంతి హరికుమార్, ఎండి రైసుద్దీన్ ,జేబీఎం స్టేట్ కోఆర్డినేటర్ పల్లి కొండ ప్రవీణ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పెంట ప్రణయ్, గడప విమల్, బర్ల వంశీ,బర్ల అర్జున్, భువనగిరి అఖిల్, మోర్తాడ్ రఘు, తదితరులు పాల్గొన్నారు