ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి.

: అబ్దుల్ కలాం చిత్ర పటానికి నివాళులు అర్పింస్తున్న నాయకులు.
బెల్లంపల్లి, అక్టోబర్15, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని 18వ వార్డ్ శంషీర్ నగర్ లో శనివారం ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఆల్ ముస్లిం మైనార్టీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం 91వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్వర్ ఖాన్ మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఇండియన్ మిస్సైల్ మాన్‌గా పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారని తెలిపారు. రాష్ట్రపతిగా అందించినటువంటి సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని అన్నారు. యువత అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడిచి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖ్వాజ మొయినుద్దీన్, రసూల్ షరీఫ్, యండి జాఫర్, రషీద్ ఖాన్, ఫెరోజ్ ఖాన్, షాదఫ్ తదితరులు పాల్గొన్నారు.