ఘనంగా మాల మహానాడు ఆవిర్భావ దినోత్సవం
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 27 : జాతీయ మాల మహానాడు 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణ అధ్యక్షులు పుట్టరాజు అధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి చేర్యాల పట్టణంలోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంగడి బజారు వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ.. అంబేద్కర్ కలలుగన్న దళితులకు రాజ్యాధికారమే పరమార్ధంగా రాజ్యాంగ రక్షణ కోసం దళితుల హక్కుల కోసం నిరంతరంగా సేవ చేస్తూ వారి హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక సంఘం మహానాడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుట్టి ఆగమల్లు, పుట్ట యాదయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి మేడిపల్లి నరసింహ, జిల్లా కార్యదర్శి కమలాపురం కిష్టయ్య, డివిజన్ అధ్యక్షులు చింతల విజయ్ కుమార్, నియోజకవర్గ ఇన్చార్జి శ్రీరామ్ వెంకటేశం, చేర్యాల మహిళా పట్టణ అధ్యక్షురాలు గుస్క వసంతి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చంద శ్రీకాంత్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు పాకనాటి భాస్కర్, మండల నాయకులు గుస్క గోవర్ధన్, పుట్ట ఐలయ్య, వలిమే సావిత్రి, ఎనమల్ల యాదమ్మ, సుద్దాల కళ్యాణి బుట్టి బాలయ్య, కాటం సత్తయ్య, బుట్టి శ్రీనివాస్, అనమల్ల శ్రీధర్, కమలాపురం శ్రీకాంత్, బడుగు అనిల్,గుస్క మనోజ్ మంగ శ్రీనివాస్ ,కాటం సంపత్ ,అనమల్ల శేఖర్, కల్లాటి రాజేష్, గుస్క చింటూ, కాటం అనిల్, తదితరులు పాల్గొన్నారు.