ఘనంగా మొహరం వేడుకలు ….

జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 9:
మండలంలోని ఇందుర్తి, కొండాపూర్, చిగురుమామిడి తదితర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం మొహరం వేడుకల్లో భాగంగా గ్రామాల్లో ఉదయం నుండి పీరీల ను ముస్లిం సోదరులు వీధుల గుండా డప్పు చప్పుల మధ్య ఊరేగింపు తీసుకెళ్లారు. ఇందుర్తి గ్రామ చావడి వద్ద పీరుల నిర్వాహకుడు అప్సర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నూతనంగా పీర్ల మసీదును సైతం దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మొహరం వేడుకలను డబ్బు చప్పుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఇందుర్తిలో మొహరం పండుగ సందర్భంగా లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రెడ్డి సంఘం అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ గాదె రఘునాథ్ రెడ్డి పీరీలను దర్శించుకుని దట్టి కట్టారు. అనంతరం ముస్లిం పెద్దలు ఆశీర్వదించారు. గ్రామాల్లో సైతం పెద్ద ఎత్తున హిందూ ముస్లింలు ప్రజా ప్రతినిధులు మొహరం వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.