ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

స్వాతంత్ర సమరయోధులు, మొట్టమొదటి కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను శుక్రవారం దురాజ్ పల్లి ముస్లిం మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో పాల్గొన్న  మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ రియాజుద్దీన్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అబుల్ కలాం ఆజాద్  మహాత్మా గాంధీ , జవహర్ లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్ లాంటి వారితో సమానంగా పోరాడి జైలు జీవితం కూడా గడిపారని అన్నారు. మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత దేశంలో ఆధునిక విద్యను తీసుకురావటానికి ఎనలేని  కృషి చేశారని కొనియాడారు.ఆయనను స్ఫూర్తిని తీసుకొని ప్రతి విద్యార్థి  ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మౌలానా  షాహిద్ , ఉర్దూగర్,షాదీ ఖానా జిల్లా చైర్మన్ కరాటే సయ్యద్, స్కూల్ ప్రిన్సిపాల్ వినోద , దయానంద్ , జానీమియా, ఖాసీం , హఫీజ్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.