ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-యూత్ కాంగ్రెస్ ఖానాపూర్ అసెంబ్లీ అద్యక్షులు కిషోర్ నాయక్
ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ఆగస్ట్ 09(జనంసాక్షి) : యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖానాపూర్ మండలంలోని సుర్జపుర్ గ్రామంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో పిల్లలకు పలకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు కిషోర్ నాయక్ మాట్లాడుతు నేటి బాలలే రేపటి పౌరులనీ సమాజానికి భవిష్యత్తు ప్రతినిధులైన బాలల బాగోగుల కోసం అందరం కృషి చెద్దమని పిలుపునిచ్చారు.ప్రతి రాజకీయ పార్టీకి యువజన విభాగం ప్రధానామని,స్వాతంత్ర్య, తెలంగాణ ఉద్యమంలో యువకులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు. యువకులకు విద్యా,ఉపాధి ప్రధానమైనప్పటికి బిజెపి, తెరాస ప్రభుత్వాలు ఆదిశలో ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు.విద్యా, వైద్య సదుపాయాలు, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుగ్యులకు ఉద్యోగాలు,నిరుద్యోగ భృతి వంటి ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ఆరోపించారు. ఈకార్యక్రమంలో సూర్జపుర్ ఎంపిటిసి సభ్యులు జంగిలి సరిత శంకర్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాబిర్ పాష, సుర్జపుర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీను, లక్ష్మణ్,కోము రవి,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు సాయి నరేష్,మండల అధ్యక్షులు మడిగేల అనిల్, సుర్జాపుర్ గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోర్తటి వంశీ తదితరులు పాల్గొన్నారు.