*ఘనంగా రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు

*రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి:సీనియర్ కాంగ్రెస్ నాయకులు*
బయ్యారం, ఆగష్టు 20(జనంసాక్షి):
 బయ్యారం, కొత్తపేట, గ్రామ పరిధి మెయిన్  రోడ్ నందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు  డా. శంకర్ నాయక్ , లక్కినేని సురేందర్,భూక్యా దాల్ సింగ్, లక్కినేని సాయి, మండల కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి ఎం పి టి సి మోహన్ జీ బానోత్, మహిళా ఉపాధ్యక్షులు కొండపల్లి లక్ష్మి, రవి, సంపత్, ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు, అనంతరం వృద్ధులకు వికలాంగులకు యాపిల్,అరటిపండ్లు, బ్రెడ్, ప్యాకెట్లు, స్వీట్స్, పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లో శాంతయ్య మాట్లాడుతూ ఇందిరా గాంధీ,ఫిరోజ్ గాంధీ ల పెద్ద కుమారుడు రాజీవ్,భారతదేశ ఆరోవ ప్రధానమంత్రిగా(గాంధీ-నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడు) 40సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ,భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి చిన్న వయస్సు ఉన్న రాజీవ్,దేశంలో తరం మార్పుకు సంకేతంగా రాజీవ్ గాంధీ దేశ చరిత్రలోనే అతి పెద్ద మెజార్టీ సాధించారు,హత్యకు గురైన తన తల్లి అంత్యక్రియలు పూర్తికాగానే ఆయన లోక్ సభ ఎన్నికలకు ఆదేశించారు,ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు7 సార్లు జరిగిన ఎన్నికల్లో కంటే అత్యధిక ఓట్లు సాధించింది 508 లోక్ సభ సీట్లలో రికార్డ్ స్థాయిలో 401 సీట్లు గెలుచుకుంది,7కోట్ల ప్రజానీకానికి నాయకుడైనాడు,1984 అక్టోబర్ 31న తల్లి ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన సమయంలో ప్రధానమంత్రిగాను కాంగ్రెస్ అద్యక్షునిగాను ఆయన నిర్వర్తించాల్సి  వచ్చింది,వ్యక్తిగత దుక్కన్నీ విచారాన్ని అనుచుకొని జాతీయ బాధ్యతను ఎంతో హుందాగా ఓర్పుగా తన భుజాలకు ఎత్తుకున్నారు. నెల రోజుల పాటు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ దేశంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అలుపు,అలసట లేకుండా ప్రయాణించారు,అనేక చోట్ల 250 సభల్లో మాట్లాడారు కోట్లాది మంది ప్రజలతో ముఖముఖీ జరిపారు,ఆధునిక భావాలు నిర్ణయత్మక శక్తి కలిగి ఈ కార్యక్రమంలో భాగంగా వార్డు నెంబరు రాంబాబు బూత్ అధ్యక్షుడు ఎరుపోతుల మధుకర్ రాజు వెంకన్న రామ్మూర్తి రవి సంతోష్ రాము హరి అనిల్ దేవేందర్ కిషన్ అజయ్ మోహన్ గణేష్ దేవా భాస్కర్ అశోక్ సునీల్ లోకేష్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.