ఘనంగా రాష్ట్రీయ శిక్షా దివస్, మైనారిటీస్ వెల్ఫేర్ డే వేడుకలు.

ప్రతి సంవత్సరం నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అని దీన్నే రాష్ట్రీయ శిక్షా దివస్ అని కూడా పిలుస్తారు. దేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టిన రోజును జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నామని స్వాతంత్ర్యం వచ్చాక మన దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ పనిచేశారు. 1947 నుంచి 1958 వరకు తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించారని భారతదేశానికి మొదటి ఉప రాష్ట్రపతిగా కూడా ఆయన సేవలందించారని జాతీయ విద్యా దినోత్సవాన్ని 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా విద్య, జాతీయాభివృద్ధికి, సంస్థల బలోపేతానికి ఆయన చేసిన సేవలను నేడు స్మరించుకుంతున్నామని ఈ రోజు చదువు విలువ గురించి అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం తద్వారా ప్రజలకు విద్య ఆవశ్యకతపై అవగాహన కల్పించడం జరుగుతుంది.అలాగే మహిళలు అన్నీ రంగాలలో ఎదుగుతున్నారని, ఆడపిల్ల అనగానే చిన్న చూపు చూడకుండా తల్లిదండ్రులు ఆడపిల్లలకు మగ పిల్లలతో సమానంగా స్వేచ్ఛను ఇవ్వాలని, మగ పిల్లలతో సమానంగా చదివించాలని, అప్పుడే ఆడపిల్లలు మగ పిల్లలతో సమానంగా అన్నీ రంగాలలో దూసుకెళ్తన్నారని అన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా మహిళల పురోగతి కూడా ఎంతో ప్రాధాన్యం వహిస్తున్నదని, ఒక మహిళ చదువుకొని వుంటే ఆమె తన పిల్లలకు సమాజం పట్ల అవగాహనే కల్పించే అవకాశం వుంటుంది కాబట్టి ఆడపిల్లలను చదివించాలని, ఎప్పటికప్పుడు తమ పిల్లలకు సమాజంలో జరుగుతున్న మంచి చెడు పై అవగాహన కల్పిస్తూ వుండాలని అన్నారు. ఒక ఆపదకర పరిస్థితి వస్తే వాటిని ఏవిధంగా ఎదురుకోవాలని, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే వాటిపై అవగాహన కల్పించాలని అన్నారు. కుటుంబ ఆర్థిక భారాలను సైతం నేడు స్త్రీ శక్తి లాగుతోందని, ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోందని వంటింటికే పరిమితం కాకుండా అన్నీ రంగాలలో ముందుండే ప్రయత్నం చేయాలని అన్నారు. మహిళలు ఆపద సమయాల్లో అధైర్యపడకుండా, వెంటనే డయల్ 100 కు సమాచారం అంధించాలని, అలాగే లోకల్ పోలీస్టేషన్ ఎస్.ఐ., సి.ఐ. ఫోన్ నంబర్ లు తమ ఫోన్లో సేవ్ చేసుకొని వుంచాలని అన్నారు. మహిళలను ఉద్యోగం నిర్వహించే ప్రాంతంలోగాని, కాలేజీలు, వీధుల్లోను ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినట్లుయితే వెంటనే డయల్‌ 100కు గాని లేదా షీ టీం వాట్సప్‌ 6303923823కు సమాచారం అంధించాలని ఎస్.పి. గారు కోరారు. ఆడపిల్లలు మహిళలలు ఎల్లపుడూ అప్రమత్తంగా వుండాలని అన్నారు. ఎల్లవేళలా పోలీసు వారు మహిళలకు అందుబాటులో వుంటారని ఇట్టి విషయంలో ఆడపిల్లలు మహిళలు భయపడనవసరం లేదని అన్నారు. మెదక్ జిల్లా పోలీస్ యంత్రాగం మహిళల భద్రత గురించి ప్రత్యేకమైన చర్యలు చేబడుతున్నట్లు ఎస్.పి.గారు తెలిపారు. అలాగే చదువులో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్ధినిలకు మేమేంటోలు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిధులు జమ్లా నాయక్ గారు, కాలేజీ ప్రిన్సిపల్ శ్రీమతి.సురేఖ గారు, శ్రీమతి జి.యశోద కృష్ణ గౌడ్ గారు, 26వ వార్డ్ కౌన్సిలర్, శ్రీ ఎం.డి సమియోద్దీన్ గారు, 11వ వార్డ్ కౌన్సిలర్, శ్రీమతి శంసున్నీషా గారు 7వ వార్డ్ కౌన్సిలర్, శ్రీ ఎం.డి ముజీబుద్దిన్ గారు, , ఇతర బోధనా సిబ్బంది మమత గారు,హుమేరా గారు, భార్గవి గారు, రెహనా గారు, కుతీజా గారు నాగరాణి గారు, స్వాతి గారు.మరియు షీ టీం సబ్యులు ఏ.ఎస్.ఐ రుక్సానా గారు, కానిస్టేబుల్ విజయ్ గారు, గంగమణి గారు పాల్గొన్నారు.