ఘనంగా వన మహోత్సవం

కరీంనగర్‌/ సుల్తానాబాద్‌: మండలంలోని గర్రెపల్లి గ్రామంలో మంగళవారం 63వ వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎన్‌ఎన్‌ఓ భూలక్ష్మీ, ఎంఈవో రాజయ్య, హెచ్‌ ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.