ఘనంగా విమోచన, వాజ్పేయి జయంతి వేడుకలు..
శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 17
తెలంగాణ విమోచన దినోత్సవం, భారత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి జయంతి వేడుకలను శంకరపట్నం మండల కేంద్రంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చల్ల ఐలయ్య ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు. శంకరపట్నం మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి, భారత మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారి వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి, కరీంనగర్ పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో రెవెన్యూ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు శంకరపట్నం గ్రామానికి చెందిన మాడ వెంకటరెడ్డి, కార్యకర్తలు రక్తదానం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్ రాజిరెడ్డి అశోక్ తో పాటు వివిధ గ్రామాల బూత్ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.