ఘనంగా సమైక్యత వజ్రోత్సవ ప్రారంభోత్సవ ర్యాలీ..

 

ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్,టీజీఓ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యామ్ నాయక్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే.

తెలంగాణలో రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలనకు పరివర్తన చెందిన రోజు సెప్టెంబర్ 17

ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్

విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 75వ సమైక్యత వజ్రోత్సవాల భాగంగా నేడు ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో 15వేల మందితో నిర్వహించిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే అజ్మీర్ రేఖ శ్యాం నాయక్ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీజీవో అధ్యక్షులు అజ్మీరా శ్యాం నాయక్ నిర్మల్ జిల్లా అదనపు పాలనాధికారి హేమంత్ బోర్కాడే ర్యాలీ ని ప్రారంభించి పట్టణంలోని ప్రధాన వీధుల గుండ అందరితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన వేదికపై పలువురు వక్తలు ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 1947 సంవత్సరంలో భారతానికి స్వతంత్రం సిద్ధించినప్పటికీ తెలంగాణ మాత్రం రజాకార్ల నిర్బంధంలో అల్లాడిందని నాటి సాయుధ పోరాట వీరుల త్యాగాల ఫలితం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1948 సెప్టెంబర్ 17న మిలిటరీ సైన్యంతో తెలంగాణకు రావడంతో తెలంగాణ ప్రజలు పూల వర్షంతో భారత ఆర్మీ ని ఆహ్వానించడంతో నిజాం రాజు తలోంగి భారతావనికి తెలంగాణ రాష్ట్రానికి అప్పగించడం జరిగిందని అన్నారు. తెలంగాణ అంటేనే పోరాటాల పురిటగడ్డ అని తెగువకు వెనకాడని నైజం ఉన్నవారే తెలంగాణ ముద్దుబిడ్డలని అన్నారు ఉద్యమాలు మన గడ్డకు కొత్త కాదని అన్నారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పటి నుండి హక్కుల కోసం కొట్లాడుతూనే ఉన్నామని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని సీఎం కేసీఆర్ సారాధ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పథంలో దేశానికి దిక్సూచిగా ప్రయాణిస్తున్నామన్నారు. అనేక సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు అన్నారు ప్రతి ఇంటికి ప్రతి ఒక్క పథకం ఏదో ఒక రూపంలో అందుతుందని తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి ఇంట ఆనందోత్సాహం నింపిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని ఈ సందర్భంగా వారు అన్నారు. అనంతరం చిన్నారుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారితో పాటు నృత్యం చేసి విద్యార్థులను ఉత్తేజపరిచారు అనంతరం కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన అదర పాలనాధికారి హేమంత్ బోర్కడే సన్మానించారు.అందరూ అధికారులు ప్రజా ప్రతినిధులు దగ్గరుండి కార్యక్రమాన్ని విజయవంతం అవ్వడానికి కృషి చేసిన వారి అందరినీ అభినందించారు.