ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి..

టేక్మాల్ జనం సాక్షి ఆగస్టు 18 మండల పరిధిలోని కుసంగి గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ పెద్దలు, గౌడ సంఘం ఆధ్వర్యంలో   సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పులమాల వేసి ఆ మహానీయుడిని స్మరించుకున్నారు.ఈ సందర్బంగా గ్రామ పెద్దలు,గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ
ఆనాటి మొగలాయి పాలకులకు వారి తాబేదారులైనా దొరల, జాగీర్దార్ల దుర్మార్గాలకు, దాష్టికాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేసి, బహుజన రాజ్యస్థాపన చేసిన మహా దిశాలి సర్ధార్ సర్వాయి పాపన్న అని అన్నారు. ఆ మహానీయుడు ప్రజా రంజకంగా పాలన చేసి తాడిత, పీడిత జనులచే నీరాజనాలు అందుకొన్న గొప్ప సామాజిక సంస్కరణ, వీరాది వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు.రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.బహుజనుల రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయుల చరిత్రలను ప్రజలకు తెలియజేయాలని, పాఠ్యాంశాలలో వారి యొక్క చరిత్రలను ప్రచురించాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సయ్యద్ ఆబేధా బేగం,యువజన సంఘాల నాయకులు సంగమేశ్వర్ గౌడ్,గౌడ సంఘం అధ్యక్షులు సత్య గౌడ్,మాజీ సర్పంచ్ మొగుల్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ మల్లయ్య,గౌడ సంఘం యూత్ అధ్యక్షులు అనిల్ గౌడ్, వివిధ కుల సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు మాజీ ఉప సర్పంచ్ నారాయణ గౌడ్, రామగల్ల అంజయ్య, డాకూరి దశరథ్,అంజి రెడ్డి,ఎనుగండ్ల మల్లేశం,నారాయణ గౌడ్,అశోక్ గౌడ్,పెద్దపురం బాలయ్య,కుంట నారాయణ,గురువ రెడ్డి, యువజన నాయకులు నారాయణ గౌడ్,ఎల్లయ్య, రమేష్ గౌడ్,మల్లేష్ గౌడ్,ప్రసాద్ గౌడ్, అంజి గౌడ్, వెంకట్ గౌడ్,భాను,ప్రసాద్ గౌడ్,వినోద్ గౌడ్,పాండ్,శంకర్,మధు,చింటుతదితరులు పాల్గొన్నారు.