ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 జయంతి వేడుకలు

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 18 (జనంసాక్షి) పోతిరెడ్డిపల్లి గ్రామంలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 జయంతి ఉత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ గనగాని మాధవి మల్లేష్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఒక సామాన్య గౌడ కుటుంబంలో జన్మించి తన కుల వృత్తి చేసుకుంటూ ఆనాటి మొగలై అరాచక పాలన వారి ఆగడాలను వ్యతిరేకిస్తూ ఎలాంటి రాజ్యపాలన అనుభవం లేకుండా తనకు తానే తన ప్రాణ స్నేహితులతో కలిసి గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసుకుని అతి తక్కువ సమయంలో సుమారు పది వేల నుండి 12 వేల సైన్యాన్ని తయారుచేసి యుద్ధవిద్యలు నేర్పి బహుజన రాజ్యాన్ని స్థాపించి ఖిలాషాపూర్ ని తన రాజధానిగా ఏర్పాటు చేసుకొని తన పాలన కు శ్రీకారం చుట్టి చివరికి ఏడు నెలల పాటు గోల్కొండ కోట నేలిన గొప్ప బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజు అని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంధ మల్ల హరీష్ వార్డు సభ్యులు ఎల్ల బోయిన శ్రీశైలం గౌడ సంఘం అధ్యక్షులు కోల నర్సయ్య గౌడ్ మక్తాల నర్సయ్య గౌడ్ కోల ఐలయ్య గౌడ్ మక్తాల స్వామి గౌడ్ కోల గణేష్ గౌడ్ మక్తాల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు