ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలు.

కౌడిపల్లి ( జనం సాక్షి).. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 జయంతి సందర్భంగా కౌడిపల్లి మండల కేంద్రంలో స్తుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి గోడ కులస్తులు,కృష్ణ గౌడ్, దుర్గా గౌడ్ లు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్  372 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగిందని, 1650 సంవత్సరంలో పుట్టిన పాపన్నగౌడ్ ఆనాటి మొగల్ , వెలమదొరల ,జమీందార్ల పాలకుల నియంత  పాలనలో ప్రజలు పడ్డ బాధలను చూసి విసిగి, వేసారిన పాపన్నగౌడ్ వారి ఆగడాలను, వారి హింసల నుండి ప్రజలను కాపాడాలని తన స్నేహితులైన కమ్మరి , కుమ్మరి, మాల ,మాదిగ , ముతిరాజ్ , సాల , మంగలి , సాకలి , గుండ్లా , దూదేకుల దళిత బహుజనులను కలుపుకొని చిన్న సైన్యం తయారుచేసుకొని ఒక్కొక్క కోటను జయిస్తూ 21 కోటలను కొట్టిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.పాపన్న ఆవేశాన్ని తట్టుకొని వెలమ జమీందార్లు ఔరంగజేబును శరణుకోరాగా రుస్తుందిల్ ఖాన్ ను ఆదేశిస్తే ఆయన ఖాసీంకాన్ ను పాపన్నపై పంపితే పాపన్నచేతిలో  ఖాసీం కాన్ మరణించడం జరిగింది .అనంతరం పాపన్న ఓరుగల్లు ,వరంగల్ , భువనగిరి ,నల్గొండ తో పాటు పక్క జిల్లాలను కోటలను వశపరుచుకొని హైద్రాబాద్ లోని గోల్కొండ కోటను కైవసం చేస్కుని పాలిస్తూ మొగల్ పాలనలోని ఆరాచకాలనుండి ప్రజలను మంచి పాలనవైపు సరిద్దిద్దే ఆలోచనలో పాపన్న ఉండగా,తను నమ్మినవారిని వ్యతిరేకులు  కోవర్టులుగా మార్చుకున్న విషయాన్ని గ్రహించలేని పాపన్నగౌడ్ శత్రువులచేతిలో మరణించే కన్నా తనచేతిలోని  కత్తితో పొడుచుకుని చనిపోవడం జరిగింది అని,ఆత్మగౌరవం అంటే ఎంటో మనకు చెప్పడం జరిగింది అని వారు తెలిపారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని వారు సూచించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామ గౌడ్ తో పాటు గౌడ కుల సోదరులు పాల్గొన్నారు.