ఘనంగా సాంస్కృతిక, జానపద ప్రదర్శన

నల్గొండ బ్యూరో. జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల లో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రం లో సెయింట్ అల్ఫోన్సస్ హై స్కూల్ లో నిర్వహించిన సాంస్కృతిక, జానపద కళాకారుల ప్రదర్శన ను ఆదివారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం సిద్ధించి 75 సం. సందర్భంగా ఆగస్ట్ 8 నుండి 22 వరకు నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలు అందరూ భాగస్వామ్యులు కావాలని,స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ని చాటేలా ఆగస్ట్ 15 న ప్రతి ఇంటా జాతీయ జెండా రెపెపలాడాలని అన్నారు.జిల్లాలో 5 లక్షల 80 వేల జెండాలు వచ్చాయని,ప్రతి కార్యాలయం,సంస్థలు,ఇంటి పై జాతీయ జెండా ఎగుర వేయాలని అన్నారు.ఆగస్ట్ 16 న 11.30 గంటలకు జాతీయ సామూహిక గీతాలాపన కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన అన్నారు.అహింసా మార్గం లో జాతి పిత మహాత్మా గాంధీ,ఎందరో మహాను భావులు త్యాగాల వలన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినట్లూ తెలిపారు.జిల్లాలో 16 థియేటర్ లలో గాంధీ చిత్రం ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లూ ,ప్రతినొక్క విద్యార్థి గాంధీ చిత్రం చూడాలని కోరారు.తెలంగాణ సాంస్కృతిక సారథులు జాన పద గీతా లు,పోలీస్ జాగృతి బృందం,విద్యార్థులు ప్రదర్శించిన దేశ భక్తి నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో అర్.డి. ఓ జగన్నాథ రావు ,డి.పి.అర్. ఓ శ్రీనివాస్,డి.యం.హెచ్ . ఓ డా.కొండల్ రావు,ఎస్.సి.కార్పొరేషన్ ఈ.డి.వెంకటేశం,తహశీల్దార్ నాగార్జున,కార్యక్రమం కో ఆర్డినేటర్ గా యం.శంకరయ్య పాల్గొన్నారు

తాజావార్తలు