ఘనంగా సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
రామారెడ్డి ఆగస్టు 7 జనంసాక్షీ
ఘనంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్లు టిఆర్ఎస్ రామారెడ్డి మండల అధ్యక్షుడు రంగు రవీందర్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాకు వైద్య కళాశా లను మంజూరు చేసినందు కు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రామారెడ్డి మండల కేంద్రంలో బస్టాండ్ చౌరస్తా వద్ద టీఆరెఎస్ పార్టీ మండల అధ్యక్షులడి ఆద్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆరెస్ శ్రేణులు పాలభి షేకం చేశామన్నారు. అనంతరం మండల రైతు బందు అధ్యక్షులు నారాయణరెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన వైద్యకళాశాలను మంజూరు చేసి రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కి కామారెడ్డి జిల్లా ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. తెరాస పార్టీ పక్షాన, కామారెడ్డి జిల్లా ప్రజానీకం తరుపున ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
వైద్య కళాశాలకు నిధులు విడుదల చేసినందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు , కళాశాల ఏర్పాటు కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందుకోసం కృషి చేసిన కామారెడ్డి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రామారెడ్డి మండల చౌరస్తాలో పార్టీ నాయకులు , కార్యకర్హలు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నా మని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవీందర్ రావు, సర్పంచ్ దండ బోయిన సంజీవ్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు రాజగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, మండల ప్రచార కార్యదర్శి సర్మన్ నాయక్, ఏఎంసి మాజీ డైరెక్టర్ పడిగెల శ్రీనివాస్, సర్పంచ్లు కుసంగి రాజనర్సు, గంగారం, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నరేష్, టౌన్ ప్రెసిడెంట్ నర్సారెడ్డి, మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కర్రోల లింగం, తెరాస సీనియర్ నాయకులు రాజేందర్ గౌడ్, లింబాద్రి నాయక్, పాల మల్లేష్, దత్తాద్రి, చంద్రునాయక్, స్వామి గౌడ్ ,ల్యాగల మైపాల్, బండి ప్రవీణ్, రాజయ్య, శ్యామ్ రావు, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.