*ఘనంగా సువిద్య డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు.

చిట్యాల సెప్టెంబర్30( జనంసాక్షి ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగ సంబరాలను శుక్రవారం మండల కేంద్రంలోని సువిద్య డిగ్రీ కళాశాలలో  ఘనముగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి కళాశాల విద్యార్థులు,అధ్యాపకులు కోలాహలంగా గొప్పగా బతుకమ్మను ఆడి అలరించారు.బతుకమ్మ పాటలతో కళాశాల విద్యార్థులు నృత్యాలు చేస్తూ అందరిని మంత్ర ముగ్దులను చేశారు.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ కందికొండ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకొనే గొప్పనైన పండుగ బతుకమ్మ అని అన్నారు.ప్రతి ఇంటి ఆడపడుచులు ఎంతో ముద్దుగా అలంకరణ చేసి ఊరు వాడ తేడా లేకుండా నిర్వహించే గొప్ప పండుగ బతుకమ్మ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న కార్యక్రమం బతుకమ్మ అని అన్నారు.ముందు ముందు కళాశాలలో మరెన్నో కార్యక్రమాలు చేయనున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు నోముల వేణు,లోకేందర్ రెడ్డి,సంతోష్,స్వామి,మాసు రమేష్,సాంబయ్య,రేణుక,సుకన్య,స్వాతి,ఝాన్సీ,ప్రీతమ్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.