ఘనంగా 76వ ఎస్టియు ఆవిర్భావ దినోత్సవం.

జనంసాక్షి న్యూస్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టియు భవన్ లో గురువారం రోజున 76వ  ఆవిర్భావ దినోత్సవమును ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జి సదానందం గౌడ్ ఎస్టియు పతాకావిష్కరణ గావించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 76 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై నిరంతరంగా పోరాడుతూ విద్యారంగంలో ఉపాధ్యాయుల సంక్షేమానికై, హక్కుల సాధనలో విజయపథంలో ముందుందని ఉద్ఘాటించారు.ఎందరో సంఘ నాయకుల త్యాగ ఫలంగా శ్రీ మగ్దూం మొయినుద్దీన్ ఆశయాలను సాధించిందని, రాష్ట్రంలో సంఘం ఎల్లవేళలా ఉద్యమబాటలో పయనించిందని రాజీలేని పోరాటమే ఊపిరిగా నిలబడ్డ సంఘం ఎస్టియూ అని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కూడా కీలకపాత్ర పోషించిందని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం పర్వతరెడ్డి సంఘం సాధించిన ఎన్నో సమస్యలను, పరిష్కారాలను వివరించారు.
రాష్ట్ర పూర్వాధ్యక్షులు భుజంగ రావు మాట్లాడుతూ సంఘ చరిత్రను సంఘ మహానాయకుల ఆశయాలను తెలిపారు.ఆదిలాబాద్ జిల్లా పూర్వాధ్యక్షులు ముకుంద రావు అంకితభావం సంఘ నిర్మాణంలో వారి కృషిని కొనియాడారు.తదనంతరం సంఘ భవనంలో నూతనంగా నిర్మించిన ఎస్టియు కన్వెన్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాథోడ్ జనార్ధన్ జిల్లా పరిషత్ చైర్మన్ ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆధ్వర్యంలో శిలాఫలకంను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అంబకంటి అశోక్ జిల్లా అద్యక్ష,ప్రధాన కార్యదర్శులు జాదవ్ అశోక్ కుమార్,       ముాగ శ్రీనివాస్,సంఘ భవన కన్వీనర్ చిలక విలాస్,సంఘ రాష్ట్ర నాయకులు పుప్పాల నరేందర్, దిలేష్ చౌహాన్, రవీంద్ర సత్యనారాయణ రాజు ఉమ్మడి జిల్లా పూర్వ, ప్రస్తుత  నిర్మల్ అధ్యక్షులు జుట్టు రాజేందర్ శంకర్ గౌడ్ తుకారాం లతోపాటు జిల్లా కార్యవర్గ సభ్యులు మండలాల అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు..
Attachments area