ఘనం గా కొండా లక్ష్మన్ బాపూజీ జయంతి వేడుకలు.

కొండా లక్ష్మన్ బాపూజీ 27 సెప్టెంబర్ ని పురస్కరించుకొని తెలంగాణ  ప్రభుత్వం రాష్ట్ర జిల్లా స్థాయిలో జయంతి ఉత్సవ సంబరాలు నిర్వహించింది.ఇందులో బాగంగా 27 సెప్టెంబర్ 2022 సోమవారం రోజున ఉదయం 10.30 గంటలకు సంక్షేమ భవనము ములుగు జిల్లాలో జయంతి వేడుకలు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆద్వర్యంలో  నిర్వహించినారు.ముఖ్య అథిదిగా పాల్గొన్న వైవి గణేష్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యు) మాట్లాడుతూ కొండా లక్ష్మన్ భాపుజి నిఖార్సయిన తెలంగాణ వాది.తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త.తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు అనికోనియాడరు.ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన వారు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి లక్ష్మన్, డి.పి జనార్ధన్ అఖిలబారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి. శ్రీదర్,ప్రధాన కార్యదర్శి చిప్ప అశోక్ ,జిల్లా అధ్యక్షులు ఎల్ల మధు సుధన్,మొగుళ్ల భధయ్య, బి.సి.సంఘ కార్యదర్శులు,హేమాద్రి సంఘ నాయకులు , బిక్షపతి గౌడ సంఘ నాయకులు,చేనేత సంఘ ములుగు జిల్లా నాయకులు రేల విజయ్ ,కందగట్ల సారయ్య,మరియు బి.సి కార్యాలయ సిబ్బంది,సకల ఉద్యోగ సంఘాల అధ్యక్షులు నాగేశ్వర్ రావు,జిల్లా అధ్యక్షుడు సంజీవయ్య,మరియు సంక్షేమ భావన కార్యాలయ సిబ్బంది.బిసి వెల్ఫేర్  శాఖా ఉద్యోగులు సరిత, జీవన్ విజయ్ కుమార్,వెంకటలక్ష్మి నాల్గోవ తరగతుల ఉద్యోగులు పాల్గొన్నారు.