ఘర్షణల మధ్యే బంగ్లాదేశ్‌లో ముగిసిన పోలింగ్
` భారత్‌కు ప్రధాని హసీనా ధన్యవాదాలు
ఢాకా(జనంసాక్షి): ఘర్షణల మధ్యే బంగ్లాదేశ్‌లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 4 గంటలకు పరిసమాప్తమైంది.మధ్యాహ్నం 3 గంటల సమయానికి దేశవ్యాప్తంగా కేవలం 27.15 పోలింగ్ శాతం నమోదైంది. ఖుల్నా డివిజన్‌లో అత్యధికంగా 32 శాతం, సిల్హట్‌లో అత్యల్పంగా 22 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం వెల్లడిరచింది. అవకతవకల నేపథ్యంలో ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. మూడు కేంద్రాల్లో మొత్తానికే రద్దు చేశారు.ప్రధాన విపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. పోలింగ్ రోజు ఘర్షణలు, కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఛత్తోగ్రామ్ స్థానంలో ఇద్దరు అభ్యర్థుల మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని, కాల్పులకు దారితీశాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. జమాల్‌పుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఢాకాలోని హజారీబాగ్‌లో ఓ పోలింగ్ కేంద్రం సవిూపంలో రెండు పెట్రోల్ బాంబులు పేలి.. చిన్నారి సహా నలుగురు గాయపడ్డారు.బంగ్లాదేశ్‌లో మొత్తం 300 నియోజకవర్గాలకుగానూ 299 స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు. అభ్యర్థి మృతితో ఒక స్థానానికి తర్వాత ఎన్నికలు నిర్వహించనున్నారు. 436 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు 27 రాజకీయ పార్టీల నుంచి 1,500 మందికిపైగా పోటీ చేశారు. జనవరి 8న ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రధాన విపక్షం ఎన్నికలకు దూరంగా ఉన్న నేపథ్యంలో నాలుగోసారి కూడా షేక్ హసీనా నేతృత్వంలోని అవావిూ లీగ్ పార్టీదే గెలుపని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్‌కు ప్రధాని హసీనా ధన్యవాదాలు!
బంగ్లాదేశ్‌లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ప్రధానమంత్రి షేక్ హసీనా ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం కీలకమని వ్యాఖ్యానించారు.’’బంగ్లాదేశ్ సార్వభౌమ, స్వాతంత్య్ర దేశం. జనాభా చాలా ఎక్కువ. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను వ్యవస్థాపితం చేశాం. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. లేదంటే దేశ అభివృద్ధి సాధ్యం కాదు. సుదీర్ఘంగా 2009` 2023 వరకు మేం అధికారంలో ఉండటం వల్లే బంగ్లాదేశ్ ఈ స్థాయికి చేరుకుంది’’ అని షేక్ హసీనా (ూష్ట్రవతిసష్ట్ర ఊజీబతినిజీ) అన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటేసే వాతావరణాన్ని కల్పించామన్నారు. ప్రధాన విపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (ఃఔఖ) ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో.. ఆమె ఆ పార్టీని ‘ఉగ్రవాద సంస్థ’గా అభివర్ణించారు.ఈ సందర్భంగా హసీనా భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘’భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండడం మా అదృష్టం. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో వారు మాకు అండగా ఉన్నారు. 1975 తర్వాత మా కుటుంబం మొత్తాన్ని కోల్పోయినప్పుడు ఆశ్రయమిచ్చారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు నా శుభాకాంక్షలు’’ అని హసీనా వ్యాఖ్యానించారు.దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తూ ఃఔఖ బంద్‌కు పిలుపునివ్వటంతో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రధాన విపక్షం ఎన్నికలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో నాలుగోసారీ షేక్ హసీనా నేతృత్వంలోని అవావిూ లీగ్ పార్టీదే గెలుపని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.