చంచల్‌గూడ వద్ద రిమాండ్ ఖైదీ హల్‌చల్
హైదరాబాద్: కోర్టు నుంచి జైలు ప్రాంగాణానికి తరలించిన ఓ రిమాండ్ ఖైదీ హల్‌చల్ సృష్టించాడు. ఇక్కడి చంచల్‌గూడ జైలు వద్ద మంగళవారం ఘటన చోటుచేసుకుంది. కోర్టు రిమాండ్ విధించగా జైలుకు తరలించిన ఎస్కార్ట్ సిబ్బందిపై ఖైదీ రెచ్చి పోయాడు. తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. కొంత దూరం పరుగైత్తిన జైలు సిబ్బంది. పట్టుకుని జైలు లోపలికి తీసుకెళ్లారు.