చంఢీీ యాగానికి రండి!

1

– పవార్‌, వెంకయ్యలకు కేసీఆర్‌ ఆహ్వానం

న్యూఢిల్లీ,డిసెంబర్‌ 10(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌లను కలిసి తానుె నిర్వహించే శతచంఢీయాగానికి రావాలని  ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌ తన ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. వివిధ అంశాలను ఆయమన కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణకు గృహ నిర్మాణ పథకం కింద రావాల్సిన నిధుల అంశంతోపాటు పలు అంశాలపై చర్చించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ కూతురు వివాహ మ¬త్సవానికి హాజరయ్యేందుకు సీఎం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే వెంకయ్యనాయుడును కలసి రాష్‌టరానికి సంబంధించి అనేక అంశాలను చర్చించారు. శాసనసభ స్థానాల పెంపు విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  వెంకయ్యనాయుడుతో భేటీ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తాను నిర్వహించే ఆయుత చండీయాగానికి ఆయనను ఆహ్వానించారు. అనంతరం వెంకయ్యనాయుడు విూడియాతో మాట్లాడుతూ… ఆయుత చండీ యాగానికి తనకు ఆహ్వానం అందిందని.. తాను హాజరవుతానని చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరైనా యాగాలుచేసుకునే హక్కు ఉందన్నారు. ఇందులో తప్పులేదన్నారు. ఆంధప్రదేశ్‌లో 175 స్థానాల నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 175 స్థానాలకు పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయన్నారు. శాసనసభ స్థానాల పెంపుపై న్యాయశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. శాసనసభ స్థానాల పెంపుపై రాజ్యాంగపరమైన సమస్యలు ఉన్నాయని.. ఈ అంశంపై న్యాయశాఖ అధ్యయనం చేస్తోందని కేంద్రమంత్రి తెలిపారు.తెలంగాణలో ప్రస్తుతం 117 సీట్లు ఉన్నాయని 153కు పెంచాలని కోరుతోందని తెలిపారు. అలాగే ఏపీ రాష్ట్రం కూడా ఎమ్మెల్యేల స్థానాలను 225కు పెంచాలని కోరుతోందని పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో కొన్ని రాజ్యాంగపరమైన సమస్యలున్నాయని వెల్లడించారు. ఈ విషయమై తాను కేంద్ర న్యాయశాఖ కార్యదర్శితో చర్చించాన్నారు. ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖ అధ్యయనం చేస్తోందని పేర్కొన్నారు. తెలుగు వాడిగా తాను రెండు రాష్ట్రాల అభివృద్దికి సహకరిస్తానన్నారు.  తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని  వెంకయ్యనాయుడు అన్నారు. గృహనిర్మాణ పథకానికి ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ స్థానాల పెంపుపై కొంత రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. తెలంగాణపై వివక్ష లేదని హడ్కో రుణం కింద రూ.3,500కోట్లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్లో తెలంగాణకు ఎయిమ్స్‌ ఇస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు. హైకోర్టు, పలు విభజన అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణ అభివృద్దికి తన వంతు పూర్తి సహాయం అందిస్తానని వెంకయ్యనాయుడు చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకానికి కేంద్ర సహకారం ఉంటుందని హావిూ ఇచ్చిరు. మురికి వాడల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.లక్ష చొప్పున ఇస్తామని వెంకయ్య తెలిపారు. అమృత్‌ సిటీ జాబితాలో సిద్దిపేటకు అవకాశం కల్పించామన్నారు.

శరద్‌ పవార్‌కు సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు

నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత, రాజ్యసభ సభ్యుడు శరద్‌ పవార్‌ను సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలిశారు. ఇవాళ పవార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ ఎంపీలు పవార్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. కాగా, త్వరలో సీఎం కేసీఆర్‌ నిర్వహించనున్న ఆయుత చంఢీయాగానికి శరద్‌ పవార్‌ ను ఆహ్వానించారు. తెలంగాణ సాధనలో పవార్‌ మద్దతిచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో రాష్ట్రంలో పర్యటించి తెలంగాణ అవసరాన్ని చాటారని పేర్కొన్నారు.