చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన టీసర్కార్.!

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులిచ్చే అంశంపై గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రేపుసాయంత్రం లోగా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి, సీపీ మహేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో రేవంత్‌ కేసు దర్యాప్తు పురోగతిని ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సీఎంకు వివరించినట్లు తెలిసింది. అదేవిధంగా చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన భద్రత మార్పులపై నిఘాచీఫ్ కేసీఆర్‌కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం.