చంద్రబాబుతో ఎమ్మెల్యే జేసి దివాకర్ రెడ్డి భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): అసెంబ్లీని అధికార పక్షం నడిపించే రోజులు పోయాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ప్రసంగిస్తూ… ఇప్పుడున్న పరిస్థితుల్లో సభ సజావుగా జరిగేలా ప్రధాన ప్రతిపక్షమే బాధ్యత తీసుకోవాలని బాబును కోరినట్లు జేసీ వెల్లడించారు.