చంద్రబాబుది శిఖండి పాత్ర : కేటీఆర్
హైదరాబాద్,(జనంసాక్షి): అసెంబ్లీలో చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లో అభివర్ణించారు. తెలంగాణపై తీర్మాణం కోసం పట్టుబడుతుంటే బయ్యారం అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చారన్నారు. గిరిజనులపై టీడీపీకి ప్రేమే ఉంటే పోలవరం విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని కేటీఆర్ ఈ సందర్బంగా చంద్రబాబును ప్రశ్నించారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే చంద్రబాబు సాధ్యం కాదంటున్న సంగతిని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. చంద్రబాబు కనుసన్నల్లో టీటీడీపీ నేతలు పనిచేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు.