చంద్రబాబు ఇంట్లో పులి.. వీధిలో పిల్లి

– నీతిఆయోగ్‌లో చంద్రబాబు పిల్లిలానే వ్యవహరించారు

– అబద్దాలను నిజాలుగా ప్రచారం చేసుకోవటంలో టీడీపీ ముందుంటుంది

– పోలవరానికి రావాల్సి నిధులన్నీ త్వరలోనే వస్తాయి

– ఏపీకి రావాల్సిన ప్రతిరూపాయిని కేంద్రం ఇస్తూనే ఉంటుంది

– బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నర్సింహారావు

న్యూఢిల్లీ, జూన్‌18(జ‌నం సాక్షి) : నీతిఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో యుద్ధ వైఖరి అనుసరించారంటూ టీడీపీ చేసిన ప్రచారంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు ఎద్దేవా వేశారు. ‘నీతి ఆయోగ్‌ సమావేశం గురించి విూడియాలో టీడీపీ అసత్యాలు ప్రచారం చేసిందని, సమావేశంలో ప్రతి ముఖ్యమంత్రి కోసం కేటాయించిన సమయం 7 నిమిషాలు. చంద్రబాబు 12 నిమిషాలు మాట్లాడారన్నారు. అయితే సీఎం ఘర్షణ విధానాన్ని అనుసరించలేదని, టీడీపీ తప్పుడు ప్రచారం పూర్తిగా ఈచిత్రాల ద్వారా బహిర్గతం అంటూ ట్విట్టర్‌లో మోదీతో చంద్రబాబు కరచాలనం ఫొటోలను విడుదల చేశారు. ఇంట్లో పులి.. వీధిలో పిల్లి అంటే ఇదేనా..!’ పోస్టులో పేర్కొన్నారు. ప్యాకేజీతోనే ఎక్కువ నిధులని విూరే అన్నారని, ప్రత్యేక ¬దా కంటే ప్రత్యేక ప్యాకేజీతోనే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబే పత్రికల్లో రాయించారని, ఇప్పుడు ఆయన తీసుకున్న యూటర్న్‌లను ప్రజలు గమనిస్తున్నారని జీవీఎల్‌ పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు రాష్ట్ర సమస్యలను విస్తృతంగా ప్రస్తావించారని టీడీపీ నేతలు బాగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారు ప్రచారాలకు పరిమితమైప్రజల అభివృద్ధికి పనిచేయడం లేదన్నారు. ప్రజా సంక్షేమానికి చొరవ తీసుకోవడం లేదని, కేంద్రం సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఏవిూ పట్టనట్టు ఉన్నారని ఆరోపించారు. స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఏర్పాటు చేయమంటే ఇంతవరకు ఎందుకు చేయలేదుని జీవీఎల్‌ ప్రశ్నించారు. పోలవరానికి రావాలిసిన నిధులన్నీ త్వరలోనే రాబోతున్నాయని, నాబార్డు ద్వారా వెంటనే విడుదల అవుతాయని మాకు సమాచారం ఉందన్నారు. వెనకబడిన జిల్లాలకు రూ. 300 కోట్ల చొప్పున కేంద్రం ఇచ్చిందని, రాష్ట్రానికి రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి కేంద్రం ఇస్తూనే ఉంటుందని జీవీఎల్‌ నర్సింహారావు పేర్కొన్నారు.