చట్టం తన పని తాను చేసుకుపోతుంది:ఈటెల

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఈ సమస్యను చంద్రబాబు రెండు రాష్ర్టాల సమస్యగా మార్చాలని చూస్తున్నాడని మండిపడ్డారు. ఇది రెండు రాష్ర్టాల సమస్య కానేకాదని, చంద్రబాబు అవినీతి వ్యవహారం మాత్రమేనని అన్నారు. జనం ఛీ కొడుతున్నా చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఫోన్‌ను ట్యాప్ చేయాల్సిన దౌర్భాగ్యం తమకు పట్టలేదని ఈటల అన్నారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినపుడు రికార్డయిన వాయిస్ చంద్రబాబుదేని తెలిపారు. గత నెల 28న స్టీఫెన్‌సన్ ఫిర్యాదు చేసిన తర్వాతనే ఏసీబీ ఆపరేషన్‌ను మొదలుపెట్టిందని వివరించారు. వీడియో టేపులు బయటపెట్టిన తర్వాతనే రేవంత్‌రెడ్డి నోరు మూతపడిందని తెలిపారు.