చట్టపరమైన నియమాలు పాటించే ఉరి అమలు చేశాం : షిండే

న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు ఉరిశిక్షకు అమలు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలియజేశారు. జనవరి 21న రాష్ట్రపతికి అఫ్జల్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను పంపినట్లు చెప్పారు. దాన్ని రాష్ట్రపతి తిరస్కరిస్తూ ఫిబ్రవరి 3న హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. జనవరి 21న రాష్ట్రపతికి అఫ్జల్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను పంపినట్లు తెలిపారు.అఫ్జల్‌ గురు దస్త్రంపై ఫిబ్రవరి 4న తాను సంతకం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఉదయం 8 గంటలకు తీహార్‌ జైల్లో ఉరిశిక్షను అమలు చేసినట్లు వెల్లడించారు. చట్టపరమైన నియమాలు పాటించే అఫ్జల్‌ను ఉరితీసినట్లు చెప్పారు. ఉరిశిక్ష అమలుపై అతని కుటుంబసభ్యులకు సమాచారమందించినట్లు తెలిపారు.