చట్టాలకు అనుగుణంగానే ఉరి: షిండే పాక్‌కు సమాచారమిచ్చాం
న్యూఢిల్లీ, నవంబర్ 21 :భారత చట్టాలకు అనుగుణంగానే కసబ్ ఉరి తీసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చట్ట పరిధికి లోబడే కసబ్‌కు ఉరి శిక్ష అమలు చేశామని తెలిపింది. కసబ్ ఉరితీతపై ముందుగానే పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ ద్వారా సమాచారమందించామని కేంద్ర ¬ం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు. అయితే లేఖ తీసుకోవడానికి పాక్ నిరాకరించడంతో.. ఫ్యాక్స్ ద్వారా పంపించామని తెలిపారు. కసబ్ మృతదేహాన్ని అప్పగించాలని ఇప్పటివరకు ఎవరు కోరలేదన్నారు. బుధవారం ఉదయం ఢిల్లీలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కసబ్‌ను ఉరి తీసినట్లు ధ్రువీకరించారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంతో కోర్టు విధించిన ఉరిశిక్ష అమలు చేయాలని ఈ నెల 7న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు చెప్పారు. అప్పుడే 21న ఉరి తీయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశ భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కసబ్ ఉరిశిక్ష అమలును గోప్యంగా నిర్వహించినట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. పాక్ కోరి ఉంటే ఇచ్చే వాళ్లమని తెలిపారు. కసబ్‌ను భారత్‌లో ఖననం చేయడం ద్వారా ఎలాంటి సమస్య ఉండదన్నారు. 166 మంది ప్రాణాలను బలిగొన్న ముష్కర మూకలకు ఇది సరైన శిక్ష అని పేర్కొన్నారు. నాటి ఘటనతో భారత్‌తో పాటు ప్రతి ఒక్కరూ తీవ్రంగా బాధ పడ్డారని చెప్పారు. ఉరితీత సమాచారాన్ని భారత రాయబారి ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలిపామని, అయితే, వారు లేఖ తీసుకునేందుకు నిరాకరించారని మరో ప్రశ్నకు బదులిచ్చారు. అయితే, ఫ్యాక్స్ ద్వారా సమాచారం ఇచ్చామని వివరించారు.కసబ్ ఉరితీతతో ముంబై పేలుళ్ల కేసు విచారణ పూర్తయిందన్నారు. పాక్‌తో పాటు కసబ్ కుటుంబ సభ్యులకు కూడా భారత రాయబార కార్యాలయం ద్వారా సమాచారం ఇచ్చామని ¬ం శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ వెల్లడించారు. కసబ్ ఉరితీత అంశాన్ని యూపీఏ ప్రభుత్వం రాజకీయ లబ్ధికి వాడుకోనుందా? అని ప్రశ్నించగా.. అలాంటిదేవిూ ఉండదన్నారు. కసబ్ ఉరితీతపై ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు క్షమాభిక్ష అంశంపై ప్రశ్నించగా.. స్పందించేందుకు ఆయన నిరాకరించారు.