చత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

3
– 15 మంది మావోయిస్టుల మృతి

– ఘటనా స్థలంలో రెండు మృతదేహాల లభ్యం

హైదరాబాద్‌   నవంబర్‌ 19 (జనంసాక్షి):

దేశంలోనే మావోయిస్టులకు కీలక ప్రాంతమైన ఛత్తీస్‌ గఢ్‌లో మరోసారి కాల్పులు ¬రెత్తాయి. పచ్చని అడవుల్లో నెత్తురు పారింది. సుకుమా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పుల్లో 15 మంది మావోయిస్టుల మృతి చెందారు.

బస్తర్‌ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….

సుకుమా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. బస్తర్‌ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బీజీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంలో పోలీసులు, కోబ్రాదళాలు గాలింపు చేపట్టాయి. ఇదే సమయంలో పోలీసు దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువురి మధ్య ఫైరింగ్‌ ఓపెనైంది. భీకరంగా సాగిన కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. మరికొందరు తప్పించుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలంలో భారీ ఎత్తున ఆయుధాలు, సాహిత్యం, డైరీలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగిస్తున్నట్టు తెలిపారు.