చరిత్రను వక్రీకరిస్తున్న పాలకులు
సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విద్రోహ దినమే
– సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్
సూర్యాపేట (జనంసాక్షి): సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విగ్రహ దినమేనని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 గురించి పలు పార్టీలు విలీనమో, విమోచనమో, సమైక్యమో అనడం చరిత్ర వక్రీకరణనేనని అన్నారు.సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విద్రోహ దినమేనని అన్నారు.హైదరాబాద్ సంస్థానంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్య శక్తుల నాయకత్వంలో ప్రజలు ఆంధ్ర మహాసభ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.ఈ సంస్థలోనే కమ్యూనిస్టు పార్టీ చేరి భూమి, భుక్తీ, విముక్తి కోసం పోరాటాన్ని ప్రారంభించిందన్నారు.1947న అధికార మార్పిడి సమయంలో నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నిర్ణయించిన సందర్భంలో, కమ్యూనిస్టు పార్టీ నిజాం రాజ్యాన్ని సాయుధంగా కూల్చివేయాలని ప్రజలకు పిలుపునిచ్చిందన్నారు.ఈ పిలుపునందుకొని ప్రజలు ముఖ్యంగా రైతులు, కూలీలు, యువతీ యువకులు వేలాది మంది గెరిళ్ళా దళాలుగా వాలంటీర్ దళాలుగా ఏర్పడ్డారని చెప్పారు.వీరి దాటికి తట్టుకోలేక నిజాం పోలీసులు , రజాకార్లు వీరికి మద్దతిస్తున్న ఫ్యూడల్ భూస్వాములు, పట్టణాలకు పారిపోయారన్నారు.నిజాం వ్యతిరేక సాయిధ తెలంగాణ పోరాటంలో సుమారు 3 వేల గ్రామాల్లో భూస్వాముల అధికారం నేలమట్టం అయిందన్నారు.దీనితో వెట్టిచాకిరీ రద్దు చేయబడిందని గుర్తు చేశారు.10 లక్షల ఎకరాలు భూమిని దున్నే పేదవాళ్లకు పంపిణీ చేయబడిందన్నారు.ఈ సమయంలో భారత ప్రభుత్వం నిజాం సైన్యంపై పోలీస్ యాక్షన్ పేరుతో దాడి చేసి వారిని సెప్టెంబర్ 17 , 1948 నాటికి లొంగదీసుకుందన్నారు.కమ్యూనిస్టు రైతాంగ గెరిల్లాల మీద దాడి చేయడం ప్రారంభించిందన్నారు. ఫ్యూడల్ భూస్వాములు, సైన్యం ఏకమై పేద రైతులు పంపిణీ చేసుకున్న భూములను స్వాధీనం చేసుకున్నారన్నారు. అందుకే తెలంగాణ చరిత్రలో 1948 సెప్టెంబర్ 17 విద్రోహ దినంగా మిగిలిపోయిందన్నారు.సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధం లేని పాలక పార్టీలు సమైక్యత పేరుతో చరిత్రను వక్రీకరిస్తు ఉత్సవాలు నిర్వహిస్తున్నరని తెలిపారు.కావున పార్టీ శ్రేణులు, ప్రజలు గ్రామ గ్రామాన నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తూ సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిస్తున్నామన్నారు.ఈ సమావేశంలో పీఓడబ్లూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక , పీడీఎస్ యు రాష్ట్ర నాయకులు ఎర్ర అఖిల్ కుమార్, పట్టణ కార్యదర్శి మాలోజి జీవన్ కుమార్ , శ్రీకాంత్ ,మహేష్ ,హుస్సేన్ , శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area
ReplyForward
|