చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి
*వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మిర్యాలగూడ. జనం సాక్షి.
ఈ నెల రోజున చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి కోరారు. సోమవారం స్థానిక లేబర్ అడ్డా వద్ద భవాని బిల్డింగ్ తాపీ వర్కర్స్ కార్మికులతో కలిసి సోమవారం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడున హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద కార్మికుల చేత ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం మందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని రంగాల్లో పనిచేసిన కార్మికులకు వెల్ఫేర్ బోర్డు సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులు అధిక సంఖ్యలో హాజరై ఛలో హైదరాబాదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ తిరుపతి రామ్మూర్తి, ఆ సంఘం అధ్యక్షులు వాస హరి కృష్ణ, ఖాజా మొయినోద్దీన్, ప్రసాద్, అయోధ్య, ఇక్బాల్, కేశవులు, ఇన్నయ్య తదితరులు పాల్గొన్నారు.