చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
జనంసాక్షి, వీణవంక, మే 26:
మండలంలోని చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి మహోత్సవాల్లో భాగంగా కేంద్రంలో జరిగిన ప్రసవాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు నరేందర్ వివరిస్తూ ఇప్పటికి రెండు ప్రసవాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నెల 10 ప్రసవాలు జరిగేలా చైతన్యపర్చాలని వైద్యులకు సూచించారు. వైద్య సిబ్బంది స్థానికంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మండలంలో గర్భిణిల సర్వే ఆధారంగా పీహెచ్‌సీిలో గర్భిణిలు వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని వారు సూచించారు. అనంతరం పీిహెచ్‌సీలో రికార్డులను, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నరేందర్, హెచ్‌ఎస్‌లు సమ్మయ్య, పద్మిని, హెచ్‌ఎలు శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్, ఎఎన్‌ఎంలతో పాటు తహశీల్దార్ టి కృష్ణ, ఎంపీడీఓ లక్ష్మినారాయణ, ఏపీఎం సుధాకర్, ఏపీిఒ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.