చాగంటి ప్రవచనాలతో అనేకులకు ఉపశమనం

భక్తిమార్గం ద్వారా సమాజానికి సేవచేస్తున్న ఆచార్యులు
విజయవాడ,నవంబర్‌1 (జనంసాక్షి) : ఉరుకులు పరుగుల జీవితంలో ఆధ్యాత్మిక చింతన ప్రతి వారికీ ఇప్పుడు అవసరమయ్యింది. కొంత ఉవమనం..స్వాంతన దక్కాలంటే నాలుగు మంచి మాటలు వినాలి. మంచిని అలవాటు చేసుకోవాలి. మాసనికంగా ధైర్యంగా నిలబడలి. ప్రఖ్యాత ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేరు తెలియని తెలుగు వారు ఉండరేమో. ఆయన ఇప్పుడు అనేక విషయాలను అలవోకగా శ్రోతలను ఆకట్టుకునేలా చెబుతున్నారు. దీంతో ఆయన నట్ల అభిమానం, ఆరాధనా భావం పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక సమయంలో ఆయన ప్రవచనాలను వింటూ కొంత మానసిక స్థిమితం పొందుతున్నారు. గత దశాబ్దంన్నరగా ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదన్నది నిస్సందేహం.ఏ ఛానెల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి. అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటి వారు. చాగంటివారు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తూ పదవీవిరమణ పొందారు. అయితే ఆయన ఏనాడు డబ్బుల కోసం ప్రవచనాలు చెప్పలేదు. చాగంటి వారికి ఉన్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచుకుంటే ఈపాటికి ఆయన వందల ఎకరాల భూములు, ధనధాన్యాదులు సంపాదించేవారు. కానీ ప్రవచనాలను ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు. ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసన పట్టారని చాలామంది పొరపడతారు. ఆయన కృషి పెద్దగా లేదు. అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి. ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మకృషి కాదు. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు. ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు. వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఒకచోట చాగంటి వారిని కలిశారు. ’విూ గురించి ఎంతో విన్నాను. విూ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. విూ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా విూ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను’ అన్నారు పీవీ. చాగంటి వారు నవ్వేసి విూ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేవిూ ఆశలు లేవు.’ అని నమస్కరించి సున్నితంగా తిరస్కరించారు. ఇది ఆయన ఔన్నత్యాన్ని చాటే సంఘటనగా చూడాలి.