చారిత్రాత్మక దినం
– ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,నవంబర్26(జనంసాక్షి):
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు చరిత్రాత్మక దినోత్సవం అని ఆయన అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ సేవలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తుతించారు. రాజ్యాంగాన్ని రూపొందించిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. రాజ్యాంగమిచ్చిన స్ఫూర్తితో అందరూ పనిచేయాలని మోదీ కోరారు. రాజ్యాంగ మనకు కల్పించిన ప్రయోజనాలను అందరూ గుర్తించాలని అన్నారు. ఇదిలావుంటే రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకుని పార్లమెంట్ ఆవరణలో ఓ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌లు ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నరేంద్రమోదీ ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అక్కడ సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని రాసి సంతకం చేశారు.