చారి ఇలాఖాచాలో  ప్రచారం

భూపాలపల్లి,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో గులాబీ శ్రేణులు దూకుడు పెంచాయి. ఇతర పార్టీలు కనీసం కారు ఛాయల్లో కూడా కనిపించని పరిస్థితి శాయంపేట మండలంలో నెలకొన్నది. భూపాలపల్లి నియోజకవర్గంలో  మాజీ  స్పీకర్‌ మధుసూదనాచారి ప్రచారం ఊపందుకున్నది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించి వారిని ఉత్తేజపరుస్తున్నారు.  సైనికుల్లా పనిచేయాలని సమాయత్తం చేశారు. ఇక విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిరికొండ ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు. గోడలపై వాల్‌రైటింగ్స్‌ను వేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టి పథకాలను ప్రజలకు వివరించేలా రైటింగ్స్‌ ఉన్నాయి.  దీంతో గులాబీ శ్రేణుల్లోఉత్సాహ వాతావరణం నెలకొన్నది.
ప్రజల మధ్యకు నిత్యం వెళ్తూ మరోసారి గెలిపిస్తే అభివృద్ధిని పెరిగెత్తిస్తానని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గులాబీ శ్రేణులు ఇంటింటికి టీఆర్‌ఎస్‌ పార్టీని చేపట్టారు. ఇప్పటికే కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్‌
మధుసూదనాచారిలు దిశానిర్దేశం చేశారు. ఈ సభ టీఆర్‌ఎస్‌ నేతల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. కార్యకర్తలకు ఎప్పటికప్పుడు సూచనలు, చేస్తూ ముఖ్యనాయకులను రంగంలోకి దింపుతున్నారు. ఇతర పార్టీల కంటే ప్రచారంలో గులాబీ శ్రేణులు ముందుండటంతో గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు.