చించొలి ఈద్గాను సందర్శించిన మంత్రి అల్లోల
నిర్మల్ బ్యూరో, జులై07,జనంసాక్షి,,, నిర్మల్ జిల్లా కేంద్రంలోని చించొలి బి శివారు వద్ద ముస్లిం మైనారిటీ లకు కేటాయించిన ఈద్గా ను బుధవారం రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ సందర్శించారు.
రంజాన్, బక్రీద్ పండుగలకు సంబందించి ప్రార్థనలు చేసే ప్రాంతాన్ని ముస్లిం మత పెద్దలతో కలిసి పరిశీలించారు.అనంతరం విశ్వనాథ్ పెట్ లోని ఈడెన్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మల్ పట్టణం ఈద్గామ్ లో ప్రస్తుతం ఉన్న ఈద్గా జనాభా కి సరిపోవడం లేనందున చించొలి బి సమీపంలో ఉన్నటువంటి 10 ఎకరాల అటవీ భూమిని నూతన ఈద్గా స్థాపించుట కొరకునిర్ణయించబడిందన్నారు. మున్సిపల్ నిధులతో ప్రార్థన నమాజ్ చేసుకునే ఈద్గా, కాంపౌండ్ వాల్, రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. వచ్చే రంజాన్ పండుగ కు ఈద్గా ను పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ అన్ని మతాల అభివృద్ధి కి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో
FSCS చైర్మన్ ధర్మజి రాజేందర్,తెరాస పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, fro జైపాల్ రెడ్డి, కౌన్సిలర్లు,కోఆప్షన్ -నాయకులు తదితరులు పాల్గొన్నారు.