చింతా ప్రభాకర్ లాంటి నాయకుడు దొరకడం సంగారెడ్డి ప్రజల అదృష్టం

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే అగ్రగామి

ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటాం

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ  మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి వలసలు

బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ సర్పంచ్ లు

టి.ఎస్.హెచ్.డి.సి చైర్మన్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్  ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు  సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి బ్యూరో  , జనం సాక్షి , జూలై 15   ::=====

చింతా ప్రభాకర్ లాంటి నాయకుడు దొరకడం సంగారెడ్డి ప్రజల అదృష్టం అని, తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే అగ్రగామి గా నిలిచిందని, పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామనీ

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ  మంత్రి హరీష్ రావు అన్నారు.

శనివారం సిద్దిపేట మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీ లో చేరారు.  బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిలో మాజీ సర్పంచ్ లు  పట్లోళ్ల జయ రాములు , పోల్కంపల్లి కృష్ణ ,ప్రస్తుత ఉప సర్పంచ్ ఆంజనేయులు , మాజీ ఉప సర్పంచ్ లక్ష్మయ్య, డీలర్ శ్రీనివాస్ గౌడ్, మన్నే మల్లేశం, పోల్కంపల్లి దుర్గయ్య, ఎండి సయోద్దిన్ ఉన్నారు. వీరందరూ బీఆర్ఎస్‌ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బి ఆర్ ఎస్ పార్టీలో చేరమన్నారు  ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరాలని ఉత్సాహంతో ఉన్నారని తెలిసింది.

పార్టీలో చేరిన వారందరూ  చింతా ప్రభాకర్  ఓడిపోయినా పట్టుదలతో నియోజకవర్గ  సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేస్తున్నారని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. వారందరూ నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న చింతా ప్రభాకర్ ను  వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు.

ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ  ముందుకు సాగుతుందన్నారు. మంత్రి హరీష్ రావు సారధ్యంలో జిల్లాలో ఎలాంటి లోటు లేదన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులతో జిల్లా శిష్యశ్యామలంగా మారబోతుందన్నారు.  ప్రతి బీర్ ఎస్ పార్టీ కార్యకర్తకు అండగా ఉంటామని హామీనీ ఇచ్చారు

తాజావార్తలు