*చికిత్స పొందుతున్న వ్యక్తిని పరమర్శించిన మాజీ జడ్పీటీసీ*

ఇటిక్యాల జూన్ 28 : (జనంసాక్షి) చికిత్స పొందుతున్న వ్యక్తిని మంగళవారం మాజీ జెడ్పిటిసి జి. ఖగన్నాథ్ రెడ్డి పరామర్శించారు. మండల పరిధిలోని  బి వీరాపురం గ్రామనికి  చెందిన బోయ శివరాముడు కుమారుడు నరేంద్ర గత కొద్ది రోజులు గ అనారోగ్యంతో కర్నూల్ గౌరీ గోపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఆయన కర్నూలు వెళ్లి పరమర్శించారు. అలాగే నరేంద్ర పరిస్థితి గురించి వైద్యులని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నరేంద్ర కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆయనతో పాటు మాజీ ఎంపీటీసీ నాగబలిమి, మండల తెరాస నాయకులు ఉన్నారు.