చికిత్స పొందుతూ యువకుడు మృతి

జనంసాక్షి రాజంపేట్
 మండలంలోని కొండాపూర్ గ్రామంలో  యువకుడు చికిత్స పొందుతూ మృతి  ఎస్సై రాజు మాట్లాడుతూ  కొండాపూర్ గ్రామానికి చెందినటువంటి పుట్ట సురేష్ కుమార్ వయసు 28 సంవత్సరాలు గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నడు యువకుడు వివాహం అయిన 4 సంవత్సరం కాలం నాటికి భార్య మరణించడంతో రోజు మానసికంగా బాధపడుతుండేవాడు అనంతరం తల్లిదండ్రులు బంధువుల సమక్షంలో మూడు నెలల క్రితం పోల్కంపేట గ్రామానికి చెందిన అనురాధతో వివాహం జరిగింది అయినా సురేష్ కుమార్ మొదటి భార్యను మర్చిపోలేక సమాధి వద్ద నిత్యం వెళ్లి మానసికంగా బాధపడుతూ ఉండేవాడు కాగా ఈనెల రెండవ తేదీన మొదటి భార్య సమాధి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు దీంతో కుటుంబ సభ్యులు విషం తీసుకున్నాడు అన్న విషయం తెలుసుకొని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉన్నదని డాక్టర్లు తెలపడంతో హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మరణించినట్లు ఆయన తెలిపారు తండ్రి పుట్ట బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు