చిట్కుల్ లో ఐలమ్మ కాంస్య విగ్రహ ఆవిష్కరణ.

 

నీలం మధు ఆధ్వర్యంలో గులాబీ జెండాలతో జనసంద్రంగా మారిన చిట్కుల్ .

పటాన్ చెరువు నియోజకవర్గం చిట్కుల్ లో బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనం

ఐలమ్మ విగ్రహావిష్కరణ బహిరంగ సభకు ఎమ్మెల్సీ బండ ప్రకాష్ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జాతీయ రజక సంఘం నాయకులు హాజరు.

పటాన్చెరు సెప్టెంబర్ 26 (జనం సాక్షి)

ఐలమ్మ జయంతి నీ పురస్కరించుకుని సోమవారం నాడు పటాన్చెరువు నియోజకవర్గం
ఇస్నాపూర్‌ జాతీయ రహదారినుంచి వేలాది ప్రజలతో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు భారీ ర్యాలీగా చిట్కుల్‌లో ఏర్పాటుచేసిన ఐలమ్మ విగ్రహం వరకూ బయలుదేరారు. నీలం మధు ముదిరాజ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఆమె కుటుంబ సభ్యులచే ఆవిష్కరింపజేయించారు. 127 ఐలమ్మజయంతి చిట్కుల్ గ్రామంలో జరపుకోవడం గర్వకారణంగా ఉందని తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా అంబేద్కర్, చాకలి ఐలమ్మ గురించి కొనియాడారని గుర్తు చేశారు. గతంలో కుల, మత బేదాలు లేకుండా విలువనిచ్చిన వ్యక్తి అంబేడ్కర్‌ అయితే నైజాం నిరంకుశత్వ పాలన వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత ఐలమ్మ అని చెప్పారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కుల, మత బేదాలు లేకుండా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేశారని అన్నారు. హనుమాన్‌ గుడి లేని ఊరు, సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని అన్నారు. మినీ ఇండియా గా ఉన్న పటాన్‌చెరు నియోజకవర్గానికి వచ్చిన ఇతర రాష్ట్రాల వారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమ రాష్ట్రాల్లో లేవని చెప్తున్నారన్నారు. పారిశ్రామికంగా అటుయాజమాన్యానికి, కార్మికులకు ఇబ్బందులు లేకుండా 24 గంటల విద్యుత్‌ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారిదే అన్నారు. బుడుగు, బలహీన, సబ్బండ వర్గాల వారు నాపై చూపుతున్న ప్రేమ, నేను మానవతదృక్పధంతో పనిచేయడంతోనే వీలు అయ్యిందని తెలిపారు. పార్టీలు, కుల, మతాలకతీతంగా పనిచేస్తున్నానని చెప్పారు. ఎక్కడ కష్టం ఉందన్నా ముందు మధున్నకు ఫోన్‌చేయండి అంటూ ముందుకు వస్తున్నారని అలాంటి కార్యకర్తలు సంపాధించుకున్నానని తెలిపారు. మంచి పనిచేస్తున్నానని పెద్దలు, స్నేహితులు ప్రోత్సహించడంతోనే మరింత ముందుకు వెళ్లి చేస్తున్నానని తెలిపారు. అలాగే నేను చేస్తున్న పనులు చూసి ఉమ్మడి మెదక్‌ జిల్లా, హైదరాబాద్‌ లనుంచి ఫోన్‌లు చేసి అభినందిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌ మాట్లాడుతూ మఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ముదిరాజ్‌ వర్గానికి ప్రాధన్యం ఇచ్చి నన్ను ఎమ్మెల్సీ చేశారని ఎమ్మెల్సీ బండప్రకాష్‌ తెలిపారు. బడుగు, బలహీన, సబ్బండ వర్గాలకు సమప్రాధాన్యత క్పలించే ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దక్కుతుందని తెలిపారు.
ఈ బహిరంగ సభలో ఇంకా చిట్యాల ఐలమ్మ కుటుంబ సభ్యులు మనవడు రామచంద్రం,ముని మనవడు సంపత్, శ్వేత, ఆశ్రిత, జాతీయ రజక సంఘాల కో ఆర్డినేటర్ మల్లేష్ కుమార్,సామాజిక ఉద్యమ కారుడు పాశం యాదగిరి,తేలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి మఠం బిక్షపతి, కొట్టాల యాదగిరి, వసంత్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు నల్లతీగల రాజు, రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వర్సపల్లి నర్సింహులు,మహిళ అధ్యక్షురాలు లావణ్య, ప్రధాన కార్యదర్శి సదామని శిరీష, కార్యక్రమ ఇంచార్జ్ చాకలి వెంకటేష్ రాష్ట్ర కార్యదర్శి జంపన్న, ఉపాధ్యక్షులు శనిగరపు రాజు, రాష్ట్ర కోఆర్డినేటర్ మడివాళ చంద్రశేఖర్, సంగారెడ్డి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు జీతయ్య, కమిటీ సభ్యులు పోచయ్య, సంజీవ,చిట్కూల్ గ్రామ రజక సంఘం నాయకులు సత్తయ్య, ఆంజనేయులు నర్సింహులు దేవేందర్ తో నియోజకవర్గ స్థాయి రజక సంఘం