చిన్నచెరువు పరిరక్షణ కోసం జైల్ కైనా వెళతాం-

తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నర్సింహ్మా

రంగారెడ్డి / ఇబ్రహీంపట్నం (జనం సాక్షి) ఇబ్రహీంపట్నం చిన్న చెరువును సందర్శించిన తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర  అధ్యక్షుడు గోరెంకల నర్సింహ్మా  జిల్లా అధ్యక్షులు చనమోని శంకర్, ఎన్పిఆర్డి
జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్కోని రాజు, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు రావనమోని రాజు, మున్సిపాలిటీ నాయకులు సొప్పరి రవి కుమార్, (టోనీ) చనమోని గోపి,ఓనమాల బాల గణేష్, పొన్నాల బిక్షపతి,జెర్కోని విరెష్ ,చనమోని సాయి కుమార్ ఈ సందర్భంగా విలేకరులతో వారు చిన్నచెరువులో వాకింగ్ పార్కును అక్రమంగా నిర్మిస్తున్న నేపథ్యంలో రైతులకు, మత్స్యకారుల అన్యాయం జరిగిందని ఆరోపించారు గతంలో మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, ఆర్డిఓ, నీటి పారుదల శాఖ అధికారులకు,జిల్లా  కలెక్టర్  కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారులు చర్యలు తీసుకోలేకపోయిన ప్రకృతి సహజంగానే విజృంభించిందని,రెండు తూములకు అడ్డంగా ఎలా పార్క్ కడతారని అందోళన వ్యక్తం చేశారు వెంటనే కూల్చివేసే వాళ్ళ పై వాల్టా చట్టం కింద చర్యలు తీసుకోవాలని అన్నారు.దానిపై పలుమార్లు మీడియా లో పార్కు వద్దని, కథనాలు వచ్చిన పట్టించుకోలేదని విమర్శించారు శిఖం భూమిలో అదికూడా చెర్వు నీరు వచ్చే ప్రాంతంలో పార్కు ఎలా నిర్మిస్తున్నారని అన్నారు సంభందించిన అధికారులు పై చర్యలు తీసుకోవాలని అన్నారు. త్వరలోనే మానవ హక్కుల కమిషన్ చైర్మన్  కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ప్రోద్బలంతో ఇదంతా జరిగిందని, అధికారులు చర్యలు తీసుకోకపోతే,త్వరలోనే పార్కును రైతులను, మత్స్యకారులను ఏకం చేసి కూల్చివేస్తామని హెచ్చరించారు