చిన్ననాటి మధుర స్మృతులను నెమరు వేసుకునేందుకు అద్దం పట్టేదిగా ఫోటోగ్రఫీ   టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి ,  ఆగస్టు 19  :

గతంలో జరిగిన సంఘటనలను ,చిన్ననాటి మధుర స్మృతులను నెమరు వేసుకునేందుకు అద్దం పట్టేదిగా ఫోటోగ్రఫీ ఎంతగానో ఉపయోగపడుతుందని టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు .సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోటో జర్నలిస్ట్ అధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన TSHDC చైర్మెన్ చింతా ప్రభాకర్ ,జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ హాజరైనారు. వారుఫోటో జర్నలిస్ట్ లతో కలసి కేక్ కట్ చేసి, ఆనందాన్ని పంచుకున్నారుతదతరం ఉత్తమ ఫోటో గ్రాఫర్ లకు ,ఫోటో జర్నలిస్టులకు సన్మానించారు.ఈ సందర్భంగా చింత ప్రభాకర్ , కలెక్టర్ లు మాట్లాడుతూగతంలో జరిగిన సంఘటనలను ,చిన్ననాటి మధుర స్మృతులను నెమరు వేసుకునేందుకు అద్దం పట్టేదిగా ఫోటోగ్రఫీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.  ఈ సందర్భంగా ఫోటో జర్నలిస్టుల సమస్యలను చింతా ప్రభాకర్ ,కలెక్టరేట్ శరత్ దృష్టికి తీసుకువచ్చారు. దానికి కలెక్టర్  సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ , బీరయ్య యాదవ్ ,ఆత్మకూర్ నగేష్ , డా.శ్రీహరి , కౌన్సిలర్లు ,ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు .