చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం అందించిన ముత్యాల సునీల్ కుమార్.
ఏర్గట్ల సెప్టెంబర్ 12 (జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రా లోని నిరుపేద కుటుంబానికి చెందిన అశోక్ శిరీష దంపతుల కూతురు అలంకృత (8) లివర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఆపరేషన కు హైదరాబాద్ వెళ్తే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని ఈ ఆపరేషన్ కొరకు ముంబైలోని క్యాన్సర్ హాస్పిటల్ కు వెళ్లాల్సిందిగా సూచించారు. విషయం తెలుసుకున్న ముత్యాల సునీల్ కుమార్ వారికి ఆరంజ్ ట్రావెల్స్ లో ముంబై వరకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ, వారికి 20వేల ఆర్థిక సాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో సునీల్ సేన సభ్యులు పాల్గొన్నారు.