చిన్నారుల మధ్య ఘర్షణ, బాలుడి మృతి

మెదక్‌, (మార్చి 24): ఇద్దరు చిన్నారుల మధ్య ప్రారంభమైన ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారడంతో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. విషాదకరమైన ఈ సంఘటన మెదక్‌ జిల్లా కోహిర్‌లో జరిగింది. ఇద్దరు చిన్నారుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఘర్షణలో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలుడు మరో బాలుడిపై కర్రతో దాడి చేశాడు. ఈ ఘర్షణలో ముజీబ్‌ అనే బాలుడు మృతి చెందాడు.