చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు కై మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన గ్రీన్ సిటీ అసోసియేషన్ సభ్యులు

మంచిర్యాల జిల్లా   కేంద్రం లోని  నూతనంగా ఏర్పాటు చేయబడిన గ్రీన్ సిటీ డి .టి. సి. పి లేఔట్ వెంచర్ లో   ప్రధానమైన మూడు పార్క్ లు  గ్రీన్ సిటీ కాలనీ వాసుల సౌకర్యార్థం  ఏర్పాటు చేయడం జరిగింది.  పచ్చదనం తో ఆహ్లాదకరంగా  ఉండడానికి గత ఏడాది ఒక పార్క్ లో  మున్సిపాలిటీ అధికారులు ప్రకృతి వనాన్ని    , రెండవ పార్క్ లో రాశి  వనాన్ని ఏర్పాటు చేశారు , మిగిలిన మూడవ పార్క్ పిల్లల పార్క్ గ నిర్ణయించారు కానీ మూడవ పార్క్ ని తాత్కాలిక నర్సరీ గా మార్చారు . కానీ కాలనీ వాసుల తో చర్చించకుండా తాత్కాలిక నర్సరీని శాశ్వత నర్సరీగా మార్చటానికి మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టడం తో విషయం చర్చనీయాంశంగా మారింది .సుమారు  350  ప్లాట్ లు కలిగి మంచిర్యాల లోనే అతిపెద్ద గ్రీన్ సిటీ  వెంచర్  లో పిల్లలు ఆడుకోవడానికి పార్క్ తప్పని సరిగా ఏర్పాటు చేయాలని   మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ , మున్సిపల్ ఛైర్పర్సన్ పెంటరాజయ్య  లకు స్థానిక కౌన్సిలర్ బొలిశెట్టి  సునీత కిషన్  ఆద్వర్యం లో  గ్రీన్ సిటీ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు . మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ వెంటనే స్పందించి గ్రీన్ సిటీ లోని నర్సరీ ని స్థానిక కౌన్సిలర్ , కాలనీ వాసులతో సందర్శించి వెంటనే నర్సరీ లోనే వాకింగ్ ట్రాక్ మరియు పిల్లలు ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం తో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు , తమ వెంట ఉండి పిల్లల పార్క్ ఏర్పాటు కి తోడ్పాటు అందించగా కౌన్సిల సునీత కిషన్ లను అభినదించారు .
ఈ కార్యక్రమం లో గ్రీన్ సిటీ  అధ్యక్షులు శోభన్ రావు , ఉపాధ్యక్షులు  సల్ల నరేష్ , ప్రధాన కార్యదర్శి అయిత శ్రీధర్ , కార్యదర్శి దాసరి ఉమేష్ , చిట్టంపల్లి వేణుమాధవ్ , కారుకూరి సత్యం , రవీందర్ చికోటి పాల్గొన్నారు
Attachments area